రాహుల్ను అన్నందుకే కేసీఆర్ను అన్నా  : ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్

రాహుల్ను అన్నందుకే కేసీఆర్ను అన్నా  : ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్

హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీని ఉద్ధేశించి మూడు రోజుల కింద కరీంనగర్ లో కేటీఆర్..‘‘ఎక్కడ సచ్చిండు రాహుల్ గాంధీ” అని అన్నందుకే కడుపు మండి కేసీఆర్ పై చావు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ ..రాహుల్ ను ఉద్ధేశించి చేసిన ఈ వాఖ్యల వీడియోను దీనికి జతచేశారు.

ఒకరి చావు కోరడం ఏమాత్రం సమర్థనీయం కాదు కానీ సీఎం రేవంత్ రెడ్డిని, స్పీకర్ ను, మహిళా మంత్రులను అసభ్యకరంగా, కులాల పేరుతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతుండడంతో కడుపు మండిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కోరే క్రమంలో ఆవేశంలో ఆ మాట అనాల్సి వచ్చిందని వివరించారు.